1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. పెళ్లికూతురు కాబోతున్న అందాల మీనా?

Meena Marriage on june Month? | పెళ్లికూతురు కాబోతున్న అందాల మీనా?

వినోదం వెండితెర గుసగుసలు పెళ్లికూతురు అందాల మీనా జూన్ పెళ్లి విద్యాసాగర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్
"సీతారామయ్యగారి మనుమరాలు" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ మీనా త్వరలో పెళ్లికూతురు కాబోతుందని కోడంబాక్కం సినీ వర్గాల సమాచారం. జూలై 12వ తేదీన మీనా బెంగుళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకోబోతుందని తెలిసింది.

వయస్సు పెరిగినా గ్లామర్ ఏ మాత్రం తరగని ఈ భామ, తాజాగా టాలీవుడ్ 'వెంగమాంబ' చిత్రంలో నటిస్తోంది. బాల నటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన మీనా 'సీతారామయ్యగారి మనవరాలు'తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 140 చిత్రాలకు పైగా నటించిన మీనా, బుల్లితెరలోనూ నటిస్తోంది.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి టాలీవుడ్ అగ్రహీరోలతో నటించిన మీనా కోలీవుడ్ సూపర్ స్టార్స్ రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ సరసన కథానాయికగా పాత్రలు పోషించింది.
About Writer
SELVI.M