1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. శిల్పకు స్మిత్ బ్యాటింగ్, వార్నే బౌలింగ్

Smith batting, Warne bowling to Shilpa | శిల్పకు స్మిత్ బ్యాటింగ్, వార్నే బౌలింగ్

శిల్పాశెట్టి రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ గ్రామ్ స్మిత్ షేన్ వార్నే
IFM
పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి తన ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ నుంచి నేర్చుకుంటోందట. ఖాళీ సమయాల్లో రాయల్స్ సభ్యులు శిల్పకు క్రికెట్ గురించి పాఠాలు చెపుతున్నారట.

ముఖ్యంగా జట్టులోని గ్రామ్ స్మిత్ వద్ద బ్యాటింగ్, షేన్ వార్నే వద్ద బౌలింగ్ చిట్కాలను నేర్చుకున్నానని సంబరంగా చెపుతోంది ఈ బ్లాక్ సెక్సీ బ్యూటీ. ఎలా నేర్పారు అని అడిగితే, పదహారు పళ్లు కనబడేలా రెండు పెదాలను అందంగా సాగదీస్తూ, వాళ్లిద్దరూ తనకు ఆట గురించి నేర్పిన ఆ రోజును మరిచిపోలేనంది.

ఒక ప్రక్క షేన్ వార్నే, మరోప్రక్క స్మిత్ ఇద్దరూ బౌలింగ్- బ్యాటింగ్‌లలో మెళకువలను పూసగుచ్చినట్లు తనకు తెలిపారని అంది. అంతేకాదు తనతో వికెట్ల మధ్య పరుగులు కూడా తీయించారనీ, వేగంగా నాలుగైదు పరుగులు చేసే సరికే అలుపు రావడంతో మైదానం బయటకు వచ్చేశాని చెప్పింది. ఎంతైనా క్రికెటర్లు గ్రేట్ అని వారిని పొగడ్తల వర్షంలో తడిపేసింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT