1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. లేడీ ఓరియెంటెడ్ పాత్రలో బిందు మాధవి!

Bindu gets into women oriented role | లేడీ ఓరియెంటెడ్ పాత్రలో బిందు మాధవి!

వినోదం వెండితెర గుసగుసలు లేడీ ఓరియెంటెడ్ పాత్ర బిందు మాధవి ఆవకాయ్ బిర్యానీ శేఖర్ కమ్ముల
"ఆవకాయ్ బిర్యానీ" ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ బిందు మాధవి, లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోందట.

హ్యాపీడేస్ నిర్మాత శేఖర్‌కమ్ముల ఇచ్చిన ఛాన్సుతో తెరంగ్రేటం చేసిన బిందుకు ఈ మధ్య ఛాన్సులు బాగానే వస్తున్నాయని సినీ వర్గాల సమాచారం. అయితే బిందు మాధవి మాత్రం మంచి పాత్రను ఎంచుకోవడంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోందట.

ఇందులో భాగంగా.. తనను వెతుక్కుంటూ వచ్చిన లేడీ ఓరియెంటెడ్ పాత్రను పోషించేందుకు బిందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ వర్గాల్లో టాక్.

ఇకపోతే.. బిందు మాధవి ప్రధాన పాత్ర పోషిస్తోన్న తాజా చిత్రానికి "కొంచెం కొత్తగా" ఫేమ్ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. త్వరలో సెట్‌పైకి రానున్న ఈ సినిమా ద్వారా తనకు సూపర్ ఛాన్స్ వచ్చేసిందని బిందు మాధవి తెగ మురిసిపోతుందట.

మరోవైపు.. పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించే మరో సినిమాలోనూ బిందు మాధవి హీరోయిన్‌గా నటించనుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
About Writer
SELVI.M