Savitri's Grandson Entering Films? | హీరోగా వస్తున్న సావిత్రి మనుమడు..!
అలనాటి సినీతార సావిత్రి వారసులెవరూ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. మే నాలుగోతేదీన జరిగిన దాసరి పుట్టినరోజు సందర్భంగా.. మహానటి సావిత్రి జీవిత చరిత్రను పుస్తకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి హాజరైయ్యారు. అచ్చు తల్లినిపోలినట్లుండిన చాముండేశ్వరి అందరినీ ఆకట్టుకున్నారు.
ఆమె వద్ద సావిత్రి వారసులుగా ఆమె మనుమడు వస్తున్నాడా అని విలేకరులు వేసిన ప్రశ్నకు.. నవ్వుతూ దాటవేశారు. ఇందులో విశేషమేమిటంటే..? సావిత్రి వారసుడుగా ప్రద్యుమ్న టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నట్లు తెలిసింది.
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండే శ్రీమన్నారాయణ కుమారుడే ప్రద్యుమ్న. అమెరికాలో పెరిగిన ఇతడు తెలుగు, తమిళ చిత్రాలతో పాటు, తన మామగారి చిత్రాలు బాగా చూస్తాడని తెలిసింది. అంతేగాకుండా ప్రస్తుతం పైట్స్, డాన్స్‌ల్లో కూడా శిక్షణ పొందుతున్నాడని సినీ వర్గాల సమాచారం. అయితే ప్రద్యుమ్న ఎప్పుడు సినీరంగానికి పరిచయం అవుతాడనే విషయం ఇంకా తెలియరాలేదు.