Dasari plans 'Bobbili Puli' with NBK? | బాలయ్య హీరోగా "బొబ్బిలి పులి" రీమేక్..?
|
ఇంతకీ బాలయ్య హుషారుకి కారణమేమిటని ఆరాతీస్తే.. దాసరి తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన 150వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని చెప్పారు. ఈ సినిమా బ్రహ్మాండమైన కాంబినేషన్‌లో తెరపైకి రానుందని దాటవేశారు. అదేమిటంటే..? ఎన్టీఆర్ నటించిన "బొబ్బిలిపులి" చిత్రాన్ని ఇప్పటి పరిస్థితులకనుగుణంగా రీమేక్ చేస్తున్నారని, ఇందులో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నట్లు తెలిసింది.
అయితే తాను ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయ సినిమాలు తీయనని, దానికి ఓ సమయం సందర్భం కావాలని దాసరి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి "మేస్త్రీ" చిత్రాన్ని తీశానని దాసరి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో... బొబ్బిలి పులి చిత్రం తీయాలంటే.. ఇప్పట్లో మళ్లీ ఎన్నికలు లేవు. మరి ఏ ఉద్దేశంతో దాసరి ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు పూనుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ సినిమా వైపు దృష్టి సారిస్తానని చెప్పిన దాసరి "బొబ్బిలి పులి" సినిమా కాకుండా.. కొత్త చిత్రాన్ని రూపొందించి, బాలకృష్ణకు మంచి హిట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
