Bhumika tells about cell phone... | స్విచాఫ్ చేస్తే బాధపడతారు: భూమిక
భూమిక ఇటీవల ఓ షూటింగ్ స్పాట్‌లో ఎంతో హుషారుగా ఓ సీన్‌లో నటించి కాస్త విరామం దొరకటంతో దగ్గరే ఉన్న ఓ చెట్టు కింద సేదతీరుతూ కనిపించిందట. ఇది చూసిన ఓ పిల్ల జర్నలిస్టు ఆమె ఇంటర్యూకోసం వెళ్లి, తొలి ప్రశ్నగా సెల్‌ఫోను గురించి మీ అభిప్రాయం అని అడిగేశాడట. దీంతో భూమిక తనకు తెలిసిన సెల్ జ్ఞానాన్ని అతనికి వరసపెట్టి చెప్పిందట.
సెల్ గురించి భూమిక మాట్లాడుతూ, "ముంబయి మహా నగరంలో సెల్‌ఫోన్ల వల్ల అనేక టూవీలర్ ప్రమాదాలు జరుగుతుంటాయి. ముంబయిలోనే కాదు అలా ప్రతి మహానగరంలోనూ జరిగే టూవీలర్ యాక్సిడెంట్‌లలో 50 శాతం సెల్‌ఫోన్ కారణంగానే జరుగుతున్నాయని పోలీసులు లెక్కలు చెపుతున్నాయి.
మహేష్‌భట్‌గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ సెల్‌ఫోన్ల వల్ల టూవీలర్ ప్రమాదాలే కాదు టూ కాలర్ ప్రమాదాలు కూడా జరుగుతాయని సెల్‌ఫోనును చేతిలో పట్టుకుని ఊపుతూ చమత్కరించారు.
నా మటుకు నేను ముఖ్యమైన పేపర్లు డీల్ చేస్తున్నప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు ప్రాజెక్టులకు సంబంధించిన వివరణ జరుగుతున్నప్పుడు, చేతిలో సెల్‌ఫోన్ అవసరమా కాదా అని నిర్ణయించుకుంటాను.
సాధ్యమైనంత వరకూ అవతలి కాల్స్‌ను ఎవాయిడ్ చేస్తాను లేదా మెయిల్ బాక్సుకు డైవర్టు చేస్తాను. సెల్ ఫోన్‌ను మాత్రం స్విచాఫ్ చేయను. స్విచాఫ్ చేస్తే అవతలి వ్యక్తిని కించపరిచినట్లు అవుతుంది" అని చెప్పి మరో సన్నివేశంలో నటించడానికి లేచి వెళ్లిపోయిందట.