Namitha pins hopes on Jagan Mohini! | "జగన్మోహిని"పై నమిత ఆశలు!
తమిళం, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటోన్న "జగన్మోహిని" సినిమాపై సెక్సీ తార నమిత ఆశలు పెట్టుకుంది. దక్షిణాది సినీ రంగంలో సెక్సీభామగా ఓ వెలుగు వెలుగుతున్న నమిత, జగన్మోహిని సినిమాలో తన అందాలను ఆరబోసినట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ చిత్రం కోసం స్కూబా డైవింగ్‌ను నమిత నేర్చుకుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
1980 ప్రారంభంలో విడుదలైన "జగన్మోహిని" చిత్రాన్ని ప్రస్తుతం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నమిత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సంగతులను నమిత తెలియజేస్తూ.. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండాలనే ఉద్దేశంతో స్కూబ్ డైవింగ్ అనే ఈతను నేర్చుకున్నానని చెప్పింది.
ఈ సినిమాకు సంబంధించి సముద్ర గర్భంలో చిత్రీకరించిన కొన్ని అద్భుత సన్నివేశాలకు స్కూబ్ డైవింగ్ ఎంతగానో ఉపయోగపడిందని నమిత వెల్లడించింది. ఇకపోతే.. ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కనున్న "జగన్మోహిని" సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమిత ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. కోలీవుడ్‌లో తన హవాను కొనసాగిస్తున్న నమితకు, టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ నటించిన బిల్లాలో నమిత నటించింది. మరోవైపు పోలీస్ అధికారిగా "దేశద్రోహి" చిత్రంలో నమిత కీలక పాత్ర పోషిస్తోంది.