Meena to enter wedlock on July 12 | జూలై 12న మీనా పెళ్లి!
|
విద్యాసాగర్, మీనాల పెళ్లి పెద్దలచే నిశ్చయింపబడిందని సినీ వర్గాల సమాచారం. ఈ మధ్య చెన్నై, సైదాపేటలోని మీనా నివాసంలో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో మీనా నిశ్చితార్థం జరిగిందని తెలిసింది.
దీంతో జూలై 12వ తేదీన మీనా-విద్యాసాగర్‌ల వివాహం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఘనంగా జరుగనుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతేగాకుండా చెన్నైలో మీనా-విద్యాసాగర్‌ల రిసెప్షన్ వైభవంగా నిర్వహించనున్నట్లు మీనా సన్నిహితుల సమాచారం.
ఇదిలా ఉంటే.. సీనియర్ నటి రాజమల్లిక, దురైరాజ్ దంపతుల కుమార్తె అయిన మీనా.. బాలనటిగా పలు భాషా చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనా అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా మీనాకు సినిమా అవకాశాలు లభించకపోవడంతో బుల్లితెరకు ప్రవేశించింది.
