Priyamani with Prince? | టాలీవుడ్ ప్రిన్స్‌తో జతకట్టనున్న ప్రియమణి?
|
ఈ నేపథ్యంలో.. ప్రియమణిని రెండో కథానాయికగా ఎంపిక చేసేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దీంతో అనుష్క, మహేష్ బాబు, ప్రియమణి కాంబినేషన్‌లో "వరుడు" తెరపైకి వస్తే.. తప్పకుండా విజయం సాధిస్తాడని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.
మరోవైపు... శింగనమల రమేష్ నిర్మిస్తున్న "వరుడు" చిత్రానికి అందాల తార ప్రియమణిని ఎంపిక చేసేందుకు వీలుగా ఫోటో సెషన్ కార్యక్రమం కూడా పూర్తయిందని సినీ వర్గాల్లో టాక్. మరి ప్రియమణికి టాలీవుడ్ ప్రిన్స్ సరసన నటించే అవకాశం దక్కుతుందో? లేదో? వేచి చూడాల్సిందే..!
