Hrithik-Aishwarya film titled Guzaarish | హృతిక్-ఐశ్వర్య జంటగా "గుజారిష్"!
జోధా అక్బర్‌లో సినిమాలో జతకట్టిన అద్భుత జంట మళ్లీ తెరపై కన్పించనుంది. యూటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న జోధా అక్బర్ ప్రేక్షకుల మన్ననలను చూరగొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తోన్న కొత్త చిత్రంలో హృతిక్-ఐశ్వర్యారాయ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరికల్లా హృతిక్-ఐష్‌ల కొత్త చిత్రం షూటింగ్ పూర్తవుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. క్రిస్టోఫర్ నొలాన్ సినిమాను ఆధారంగా తీసుకుని రీమేక్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు "గుజారిష్" అనే పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. జోధా అక్బర్ చిత్రం తరహాలోనే ఐష్-హృతిక్‌ల కొత్త చిత్రం కూడా యూటీవీ ప్రొడక్షన్స్‌పై తెరపైకి రానుంది.