1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. బాలీవుడ్ మగాళ్ల ప్రపంచం: బిపాసా

Bollywood is man's world: Bipasha | బాలీవుడ్ మగాళ్ల ప్రపంచం: బిపాసా

బాలీవుడ్
బాలీవుడ్ పురుషాధిక్య ప్రపంచం అయిపోయింది. కనకవర్షం కురిపించే బొమ్మలుగా మాత్రమే కథానాయికలను ఇక్కడ చూస్తారు. మరో విషయం ఏమిటంటే, హీరోయిన్ ఖాతాలో ఒక్క ప్లాప్ కనుక నమోదైతే వారిది ఐరన్ లెగ్ అనేస్తారని తెగ బాధపడిపోతోంది బాలీవుడ్ సెక్సీతార బిపాసాబసు.

ఈ ఏడాదిలో ఆమెకు ఒకే ఒక్క ఛాన్స్ దక్కింది. రాజ్ చిత్రం సీక్వెల్ రాజ్-2 రూపుదిద్దుకున్నప్పటికీ ఆ చిత్రంలో బిపాసాకు చోటు దక్కలేదు. దాంతో ఆ చిత్ర దర్శక నిర్మాతలపై పరోక్షంగా విమర్శలకు దిగింది.

దానితోపాటే తాను ఎంతో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిననీ, అవకాశాలు దొరక్కపోతే కొందరు తారలు ఏడుస్తూ మూలన కూచున్నట్లు తాను కూచోనని, తనకు ఎన్నో వ్యాపకాలున్నాయని అంటోంది బిపాస.

బిపాసా కస్సుబుస్సులు విన్న కొందరు దర్శకనిర్మాతలు ఆమెకు బాగా పొగరెక్కిందని, లోకం పోకడ తెలియక ఏవో అవాకులు చెవాకులు పేలుతోందని బిపాసా సన్నిహితుల వద్దే చెప్పేస్తున్నారట. అంతేకాదు అవకాశాలు దొరకని వాళ్లంతా ఇలానే మాట్లాడతారని ఎద్దేవా చేస్తున్నారట. మరి ఈ మాటలకు బిపాసా ఏమంటుందో మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT