1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. అసిన్‌కోసం సల్మాన్ క్యూట్ కుక్కపిల్లకై వెతుకులాట

Salman dog hunting for good friend Asin | అసిన్‌కోసం సల్మాన్ క్యూట్ కుక్కపిల్లకై వెతుకులాట

సల్మాన్ ఖాన్
బాలీవుడ్ బ్యాచిలర్ హీరోలు కాస్తంత టైమ్ దొరికితే చాలు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా... అని తెగ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే దారిలో ఉన్నాడు. ప్రస్తుతం కాస్తంత సమయం దొరకడంతో సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై దృష్టిపెట్టాడు.

దీంతో అతనికి ఎప్పుడో ఒకరోజు బక్కపలచని భామ అసిన్ చెప్పిన మాట గుర్తుకు వచ్చిందట. అసిన్ చెప్పిన మాట ఏమిటీ... అనుకుంటున్నారా...? అసిన్‌కు ఎన్నాళ్లగానో ఓ చిన్న కుక్కపిల్లను పెంచుకోవాలనే ఆశ అలానే మిగిలి ఉందట. ఎంత వెతికినా తనకు నచ్చిన కుక్కపిల్ల ఇప్పటివరకూ దొరకనే లేదట. ఇదే మాటను ఆ మధ్య సల్మాన్‌ఖాన్‌తోనూ చెప్పిందట.

కండల వీరునికి చెపితే ఊరుకుంటాడా...? కొండమీద కోతినైనా తీసుకురాడూ... అంతే, అసిన్ కోరిక తీర్చేందుకు తనకు అందంగా కనబడిన కుక్కపిల్లలన్నిటినీ సేకరిస్తున్నాడట. తన పనివాళ్లకు సైతం అందమైన కుక్కపిల్లలు ఎక్కడైనా కనబడితే పట్టుకురండి అని చెపుతున్నాడట. అన్నీ చేర్చిన పిదప ఓ ఫైన్ మార్నింగ్ అసిన్‌ను పిలిచి కుక్కపిల్లల గుంపులో ఆమెకు నచ్చిన పిల్లను ఎంపిక చేసుకోమని అడుగుదామనుకుంటున్నాడట.

మరి అసిన్‌కు సల్మాన్ కుక్కపిల్లలు నచ్చుతాయో లేదో... చూడాలి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT