గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » బికినీ వేసుకుంటే తప్పేంటి..?: ప్రియమణి (No regrets for Bikini show : Priyamani)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి "బికినీ" డ్రెస్‌కు కొత్త లాజిక్ చెబుతోంది. ఇంట్లో ఉంటే నైట్‌డ్రెస్ వేసుకుంటాం. ఏదైనా ఆట ఆడితే దానికి సంబంధించిన దుస్తులే తొడుక్కుంటాం. వాకింగ్‌కు వెళితే ట్రాక్ షూ వేసుకుంటాం. అలాగే ఈతకొట్టాలంటే.. ఈతకొట్టే దుస్తులే వేస్తాం. ఇందులో తప్పేముంది. సల్వార్ కమీజ్‌తో స్విమ్ చేయలేం కదా..? అంటూ "ద్రోణ"లో బికినీ వేసుకున్న వైనాన్ని ప్రియమణి పూస గుచ్చినట్లు వివరించింది.

తాజాగా బాలకృష్ణతో "మిత్రుడు" చిత్రం సక్సెస్ మీట్‌లో ప్రియమణి పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వద్ద డ్రెస్‌లపై కొన్ని ప్రశ్నలడిగితే పైవిధంగా స్పందించింది. మొదట్లో బికినీ వేసుకునేందుకు ఒప్పుకోలేదు. కానీ దర్శకుడు ఇప్పటిదాకా మిమ్మల్ని చూడని విధంగా ప్రెజెంట్ చేస్తానని చెప్పడంతో అంగీకరించానని ప్రియమణి వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. "మిత్రుడు" సినిమాలో ప్రియమణికి షూటింగ్ లేకపోయినా.. చిత్రీకరణలో హాజరయ్యారని బాలకృష్ణ గొప్పగా చెప్పారు. అంత ఇంట్రెస్ట్ ఎలా కలిగిందనే దానికి ప్రియమణి స్పందిస్తూ.. బాలకృష్ణ అంటే హలోసార్, గుడ్ మార్నింగ్ అంటూ పలకరింపు వరకే అయినా, ఆ తర్వాత క్రమేణా ఎన్నో విధాలుగా సహకరించేవారు.

అంతేకాదు.. బోలెడు జోకులు వేస్తూ టైమ్ తెలీయకుండా గడిపేవాళ్లం. అందుకే తనకు షూటింగ్ లేకపోయినా ఆయన జోకుల కోసం షూటింగ్‌కు వచ్చేదానినని ప్రియమణి వివరించింది. మరి అదండీ సంగతి.. నమ్మాలి తప్పదుగదా..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం, వెండితెర, గుసగుసలు, బికినీ, డ్రెస్, తప్పు, ప్రియమణి, మిత్రుడు, షూటింగ్, సక్సెస్ మీట్, బాలకృష్ణ, జోకులు