1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. ఆ విషయంలో నన్నెవరూ బలవంతం చేయట్లేదు..!

Anybody not forced about my marriage: Sneha | ఆ విషయంలో నన్నెవరూ బలవంతం చేయట్లేదు..!

వినోదం
WD
ఎవరూ తనను బలవంతం చేయట్లేదని నవ్వుల సుందరి స్నేహ అంటోంది. ఇదేదో సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. అనుకునేరు. ఇంతకీ స్నేహను పెళ్లి చేసుకోమని ఎవరూ ఆమెను బలవంతం చేయలేదట. పెళ్లి చేసుకోమని ఇంట్లో ఎవరూ పట్టుపట్టడం లేదని స్నేహ బలగుద్ధి చెబుతోంది.

పెళ్లి ప్రస్తావన వస్తేనే.. అప్పుడే పెళ్లేంటి? ఇంకా మూడేళ్లు పడుతుందని స్నేహ కచ్చితంగా చెప్పేస్తుందట. అంతేకాదు.. ఏది ఏమైనా జరగాల్సింది.. ఆ సమయంలో జరిగి తీరుతుందని అమ్మడు కాస్త వేదాంతం కూడా జోడించిందట. ఇంకేముంది.."శ్రీరామదాసు" చిత్రం చేసింది.. కాబట్టి స్నేహ వేదాంతి అయిందేమోనని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఇంకా స్నేహకు దేవుడంటే విపరీతమైన భక్తి అని అంటోందట. ఆయన లేనిదే తాను లేదని, మీరూ లేరని ఎదురు ప్రశ్న వేస్తోందట. మరీ స్నేహ పెళ్లెప్పుడు జరగాలని ఉందో? ఆ దేవుడికి తెలియాలి..!
About Writer
SELVI.M