1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదు: నవనీత్ కౌర్

No idea to fall in love: Navneeth kaur | ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదు: నవనీత్ కౌర్

వినోదం
అందాల ఆరబోతకు అడ్డుచెప్పని పంజాబీ నటి, సెక్సీతార నవనీత్ కౌర్. టాలీవుడ్ అగ్రహీరోలతోనే కాకుండా యూత్ హీరోల సరసన నటించిన నవనీత్ కౌర్, తాజాగా ఫ్లాష్‌‍న్యూస్, కాలచక్రం వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పంజాబీ భామ ప్రేమలో పడిందని, అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి.

ఈ విషయమై నవనీత్‌ కౌర్‌ను కదిలిస్తే.. తాను ప్రేమలో పడినట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని కొట్టి పారేసింది. తన గురించి ఎవరెవరో ఏవేవో అంటుంటారు. వాటిని పట్టించుకుంటే ఇక్కడ ఉండేదాన్ని కాదని నవనీత్ కౌర్ తేల్చి చెప్పేసింది.

ఎక్కడైనా.. ఎవరితోనైనా కనిపిస్తే చాలు.. వారి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇదొక విచిత్రమైన ఫీల్డని నవనీత్ కౌర్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదని, పెళ్లి విషయంలో పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని తెలిపింది.