1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. కేన్స్ చిత్రోత్సవానికి హృతిక్ రోషన్!

Hrithik going to Cannes with Barbara | కేన్స్ చిత్రోత్సవానికి హృతిక్ రోషన్!

వినోదం
ఫ్రాన్స్‌లో అంగరంగవైభవంగా ప్రారంభమైన కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి, బాలీవుడ్ స్టార్, ధూమ్ హీరో హృతిక్ రోషన్ కూడా వెళ్లారట. ఈ చిత్రోత్సవంలో హృతిక్ రోషన్ "కైట్స్" చిత్రం ప్రదర్శించబోతున్నట్లు తెలిసింది.

దీనికోసం హృతిక్‌తో పాటు అతని తండ్రి రాఖేష్ రోషన్, చిత్ర దర్శకుడు అనురాగ్ బసులు కూడా ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. వీరితో పాటు మెక్సిలో బాలీవుడ్ తార బర్బరా మోరీ కూడా కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొంది.

ఇంకేముంది.. బిగ్ పిక్చర్స్‌పై నిర్మితమైన "కైట్స్" ప్రపంచదేశాలకు చెందిన అభిమానుల ముందు ప్రదర్శించబడుతోందన్న సంతోషంలో హృతిక్ మునిగి తేలుతున్నట్లు తెలిసింది.

అంతేకాదు.. రాఖేష్ రోషన్ సొంత బేనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించబడటంపై హృతిక్ కుటుంబమంతా చాలా హ్యాపీగా ఉందట.

ఇకపోతే... క్రేన్స్ ఫెస్టివల్‌లో "కైట్స్" ప్రదర్శనను పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీన హృతిక్ ఫ్యామిలీ స్వదేశానికి చేరుకుంటుందని సినీ వర్గాల సమాచారం.