Shahid-Priyanka v/s Saif-Kareena | షాహిద్-ప్రియాంక వర్సెస్ సైఫ్-కరీనా
విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన "కమీనే" చిత్రంలో షాహిద్-ప్రియాంక చోప్రాలు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మంచి స్నేహితులైన షాహిద్-ప్రియాంకల మధ్య మాజీ ప్రియురాలి గొడవొచ్చి పడిందట.
షాహిద్, ప్రియాంకతో సన్నిహితంగా ఉండటం చూస్తోన్న అతని మాజీ ప్రియురాలు కరీనా... ఈ మధ్య సైఫ్ అలీఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని వార్తలు గుప్పుమన్నాయి.
ఈ నేపథ్యంలో.. షాహిద్-ప్రియాంకల విషయమై కరీనాను కదిలిస్తే.. ఆ సంగతిని అంతటితో వదిలేయండని అంటోందట. ప్రియాంకతో- షాహిద్ క్లోజ్‌గా ఉంటే ఉండనివ్వండని మెల్లగా జారుకుందట. ఇదే విషయమై ప్రియాంకను కదిలిస్తే అసలు నోరు మెదపడం లేదట.
మరోవైపు కంబత్క్ ఇష్క్, కమీనే చిత్రాల పబ్లిసిటీ కోసం షాహిద్-ప్రియాంక, కరీనా-సైఫ్ అలీఖాన్ జంటల మధ్య ఏదో అఫైర్ కొనసాగుతుందనే వదంతులు లేవనెత్తుతున్నారని వారి కుటుంబీకులు మండిపడుతున్నారట.
అయితే ప్రియాంక-షాహిద్, కరీనా-సైఫ్ అలీ ఖాన్‌లు వేటిని పట్టించుకోకుండా హ్యాపీగా తిరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తాజాగా ప్రియాంక చోప్రా ప్రేమలో పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కరీనా కపూర్‌తో ఏడాది క్రితం విడిపోయినప్పటి నుంచి షాహిద్ తగిన ప్రేమికురాలిని వెతుక్కోవడంలో తంటాలు పడుతున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో కమీనే హీరోయిన్ ప్రియాంక వలలో పడటంతో.. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని సమాచారం.
మరోవైపు.. కమీనేలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ప్రియాంక-షాహిద్‌లపై ఘాటైన ముద్దు సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. కథ పరిధి మేరకే ఆ సన్నివేశాలు ఉన్నాయని ప్రియాంక చెబుతున్నా, షాహిద్ కపూర్‌తో ప్రేమలో పడటం వల్లే ఆమె ఈ సన్నివేశాల్లో నటించడానికి అంగీకరించిందని సినీ వర్గాల్లో టాక్.
ఇంకేముంది.. షాహిద్-ప్రియాంకల ప్రేమాయణం ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.. మరి..!