1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. అంకిత ఫేవరెట్ పొలిటీషియన్ గెలుస్తుందో... లేదో!!?

Is Ankita favourite politicien will win? | అంకిత ఫేవరెట్ పొలిటీషియన్ గెలుస్తుందో... లేదో!!?

అంకిత
దేశం యావత్తూ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయోనని ఎదురుచూస్తున్నాయి. సినీతారలు సైతం రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీలు ఎన్నెన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నాయో తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

టాలీవుడ్‌లో చాలామంది తారలు శనివారం షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో టీవీల ముందు కూచుని పరిస్థితి చూసేందుకు రెడీగా ఉన్నట్లు టాలీవుడ్ ఫిలిమ్ న్యూస్.

అందాల తార అంకితకు తమ ఫేవరెట్ పొలిటిషియన్స్ విజయం సాధిస్తారో లేదో తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోందట. తనకు ఇష్టమైన మహిళా రాజకీయ నేతలు విజయం సాధిస్తే గ్రాండ్ పార్టీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నదట.

ఆమెను అంతగా ఆకట్టుకున్న రాజకీయ నాయకురాలు ఎవరై ఉంటారో... అని అడిగితే అది మాత్రం సస్పెన్స్ అంటోందిట. కనుక సదరు రాజకీయ నాయకురాలు విజయం సాధించిన తర్వాతే అంకిత ఆమె పేరు చెపుతుందన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT