1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. కన్నడంలో ప్రియమణి "రెడీ"!

‘Ready’ in Kannada with Priyamani!!! | కన్నడంలో ప్రియమణి "రెడీ"!

వినోదం
WD
కన్నడంలో నటించేందుకు ప్రియమణి "రెడీ" అంటోందట. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన హవాను కొనసాగిస్తున్న ప్రియమణి త్వరలో కన్నడ ప్రేక్షకులను సైతం తనవైపు తిప్పుకోనుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ "రెడీ" చిత్రం కన్నడంలో రీమేక్ కానుంది. మస్కా హీరో రామ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించి, శ్రీనువైట్ల రూపొందించిన రెడీ సెన్సేషనల్ హిట్టైన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని కన్నడంలో త్వరలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కన్నడ భాషను బాగా మాట్లాడగలిగే ప్రియమణి ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లో సంతకాలు కూడా చేసేసిందని తెలిసింది. అంతేకాదు.. కన్నడ "రెడీ"లో కన్నడం సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో ప్రియమణి జతకట్టనుందని సినీ వర్గాల సమాచారం. మరి కన్నడ "రెడీ", రామ్ రెడీల హిట్ అవుతుందో? లేదో? వేచి చూడాల్సిందే..!
About Writer
SELVI.M