Mamta wants to go to Bollywood | బాలీవుడ్‌లో అడుగెట్టనున్న మమత!
హోమం, చింతకాయల రవి వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న మమతా మోహన్ దాస్ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్‌లో నటీమణిగా, గాయనిగా గుర్తింపు సంపాదించిన ఈ మలయాళం సెక్సీ బ్యూటీ త్వరలో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించనుంది.
మమతా మోహన్‌దాస్‌కు ఈ మధ్య బాలీవుడ్ ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయని, ఆమె కాల్షీట్ కోసం పలు హిందీ నిర్మాతలు వేచి ఉన్నారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇందులో భాగంగా.. బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్‌తో మమతా మోహన్ దాస్ జత కట్టనుందని తెలిసింది.
అంతేగాదు.. మమతాకు బాలీవుడ్ సినిమాల్లో నటించాలంటే ఎంతో ఇష్టమట. ఇంకేముంది.. చాలా రోజులుగా బాలీవుడ్ చిత్రంలో నటించాలన్న మమత కల నెరవేరబోతుందన్నమాట. ఆల్ ది బెస్ట్ మమత..!