Kamalini looking at Bengalwood | బెంగాల్‌కే కమలిని తిరుగుముఖం..!?
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల "ఆనంద్" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పశ్చిమ బెంగాల్ ముద్దుగుమ్మ కమలిని ముఖర్జీ. గోదావరి, మీనాక్షి, స్టైల్ వంటి చిత్రాల్లో నటించిన కమలినికి "గమ్యం" మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది.
తాజాగా గోపి గోపిక గోదావరి, పోలీస్ పోలీస్ సినిమాల్లో నటిస్తోన్న ఈ వాలు కనుల కమలినికి ఈ మధ్య ఛాన్సులు అంతగా రావడం లేదని సినీ వర్గాల్లో టాక్.
తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఈ భామ చేతిలో అంతగా సినిమాలు లేవని తెలిసింది. దీంతో కమలిని తన స్వస్థలమైన బెంగాల్‌కే తిరుగుముఖం పట్టనుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అయితే త్వరలో విడుదల కానున్న "పోలీస్ పోలీస్" సినిమాతో, కమలిని టాలీవుడ్‌లో నిలదొక్కుకునే అవకాశముందని భావిస్తోందట. ఇప్పటివరకు హోమ్లీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కమలిని ఈ చిత్రంలో కాస్త అందాలను ఆరబోసిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మరి కమిలిని ప్రదర్శించిన ఈ గ్లామర్ ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే..!