1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. "పిస్తా" శ్రేయ.. ము..ము... ముద్దంటే చేదా..

Sreya and Vishal's hot kiss in PISTA | "పిస్తా" శ్రేయ.. ము..ము... ముద్దంటే చేదా..

శ్రేయ
శ్రేయ హాలీవుడ్ రేంజ్‌ను దాటిపోయేటట్లు కనిపిస్తోంది. సొగసులు ఆరబోతలో అగ్రస్థానంలో నిలిచిన ఈ జాణ తాజాగా "పిస్తా" చిత్రంలో విశాల్ పెదవులతో తన పెదవులను బిగించింది. చిత్రంలో కథానుసారంగా, సన్నివేశం డిమాండ్‌ను అనుసరించి విశాల్ పెదవులతో ముడి వేయాల్సి వచ్చిందని ముద్దిచ్చిన హీరోయిన్ల మాదిరే శ్రేయ కూడా చెపుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదనుకోండి.

ఇక విశాల్ విషయానికి వస్తే, హీరోయిన్లతో కలిసి మగ శరీరాన్ని ఎక్స్‌పోజ్ చేయడంలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడీ తిరుపతి కుర్రాడు. ఆ మధ్య "సెల్యూట్"లో నాభి కిందవరకూ ధరించిన దుస్తులతో నాభీ లోతులను చూపిన నయనతార ప్రక్కన కండలను ప్రదర్శిస్తూ ఫోటో గ్రాఫర్లకు అడిగినన్ని ఫోజులిచ్చాడు "విశాల" హృదయుడు. అదే బాణీలో ఇప్పుడు తాజాగా లిప్-టు-లిప్ ముద్దుకు సిద్ధమయ్యాడు.

ఈ హాట్ కిస్ కనువిందు చేయాలంటే పిస్తా చిత్రం విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే. పాత సినిమాల్లో పదాలను కూర్చి- ము..ము... ముద్దంటే చేదా... అంటే నేటి తరం తారలు పెదాలను బిగించి మరీ ముద్దులు పెట్టుకుని చూపిస్తున్నారు. మరి శ్రేయ, విశాల్ లు సన్నివేశంలో చూపిన ముద్దు దృశ్యం వరకూ ఆగారో లేదో.. (ష్... ఆపైన పిస్తాలో చూడాల్సిందే)
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT