1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. కాజల్ సిస్టర్ వచ్చేస్తుందోచ్..!

Kajal Agarwal’s sister is arriving… | కాజల్ సిస్టర్ వచ్చేస్తుందోచ్..!

వినోదం
WD
టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. చందమామ, సరోజ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు సంపాదించిన కాజల్, తన సోదరి నిషాను, మెగాస్టార్ తనయుడు, చిరుత హీరో రామ్ చరణ్ తేజ సరసన నటింపజేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

దీనికి సంబంధించిన ఫోటోసెషన్ కూడా పూర్తయిందని, త్వరలో నిషా అగర్వాల్ "మగధీర"తో కలిసి సన్నివేశాల చిత్రీకరణకు సై అంటోందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

ఇప్పటికే గ్లామరస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న కాజల్ అగర్వాల్, తన సోదరికి ఛాన్సివ్వాలని అడిగిన వెంటనే మగధీర దర్శక, నిర్మాతలు ఓకే అనేశారని తెలిసింది. మరి.. "మగధీర" సరసన నిషా అగర్వాల్‌కు నటించే ఛాన్స్ దొరుకుతుందో? లేదో? కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!