Ileana pair with Manchu Manoj..!? | మంచు మనోజ్ సరసన ఇలియానా..!?
నేను మీకు తెలుసా? ఫేమ్ మంచు మనోజ్‌తో సెక్సీతార ఇలియానా నటించబోతోందట. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.
మంచు మనోజ్, స్నేహా ఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన నేను మీకు తెలుసా? చిత్రం మనోజ్‌కు పెద్ద సక్సెస్‌ను సంపాదించి పెట్టలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న మనోజ్, చంద్రశేఖర్ ఏలేటి నిర్మాణ దర్శకత్వంలో "ప్రయాణం" ద్వారా సక్సెస్‌ను పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా ఈ నెల 29న తెరపైకి రానుంది.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధమౌతోంది. ఇందులో యాదృశ్చికమేమంటే..? ఇలియానా ఇప్పటికే మంచు విష్ణుతో ఇదే పతాకంపై, వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో "సలీమ్" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రిలయన్స్ గ్రూప్ సహకరిస్తోంది. ఇంకేముంది..? అన్నాదమ్ముల సరసన ఇలియానా నటించనుందన్నమాట..!.