1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. భారీ ఆఫర్‌తో తెలుగు తెరకు దీపిక!

Deepika padukone to act with Ram Charan | భారీ ఆఫర్‌తో తెలుగు తెరకు దీపిక!

వార్తలు
FileFILE
"ఓంశాంతి.. ఓం" చిత్రంతో బాలీవుడ్ వెండితెర ప్రవేశం చేసిన ముద్దుగుమ్మ దీపికా పదుకొనే. ఈ చిత్రంలో తన నటనతో సంపాదించుకున్న పేరు అంతంతమాత్రమే అయినప్పటికీ.. భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్‌ సింగ్‌లతో నడిపిన "డబుల్ గేమ్" ప్రేమ వ్యవహారం ఆమెకు మంచి పబ్లిసిటీనే తెచ్చిపెట్టింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వెండితెరపై తళుక్కున మెరవనుంది. చిరు తనయుడు రామ్ చరణ్‌తేజ్‌తో ఒక యాడ్‌లో జోడీగా నటించిన ఈ భామ.. బాగానే ఆకట్టుకుంది. యాదృచ్ఛికమో ఏమోగానీ.. దీపిక నటించే తొలి తెలుగు చిత్రంలో హీరో కూడా రామ్ చరణ్ తేజ కావడం గమనార్హం.

ప్రస్తుతం "మగధీర" చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్.. తన తదుపరి చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. "బొమ్మరిల్లు" భాస్కర్ నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పదుకొనేను ఎంపిక చేశారు. అయితే, బాలీవుడ్‌లో ఉన్న క్రేజీని దృష్టిలో ఉంచుకుని ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించేందుకు భారీగానే ఆఫర్ చేసిందట.

దీంతో హీరో రామ్ చరణ్ చొరవ తీసుకుని పదుకొనేను ఒప్పించినట్టు సమాచారం. ఫలితంగా రామ్ చరణ్-దీపికా పదుకొనే జంట తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనుంది.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి