Mam Mumtaz.. Pls take one sigar | మేడం ఓ దమ్ము లాగండి ప్లీజ్...
|
అయితే సినిమా హాలులో ప్రేక్షకులు తనను గమనిస్తారేమోనని హాలులోని వెనుక వరుసలో దర్శకుడు శక్తిచిదంబరంతో కలిసి కూర్చుని చూడసాగింది. అయితే డేగ కళ్ల తమిళ తంబీలు ముంతాజ్ వెనుక కూర్చున్న విషయాన్ని పసిగట్టేశారు.
చూసిందే తడవుగా, "మేడమ్... ఏది మాకోసం ఒక్కసారి దమ్ము కొట్టరూ..." అని సిగరెట్లు తీసి ముంతాజ్‌పైకి ఎగబడ్డారట. ఒక ఆకతాయి అయితే నేరుగా సిగరెట్ వెలిగించి ముంతాజ్ నోటికి అందివ్వబోయాడట. దీంతో బిత్తరపోయిన తాజ్ తనకు అలాంటి అలవాట్లు లేవనీ, సినిమా కోసం దమ్ము లాగానని వివరణలిచ్చుకుందట.
అయినా తమిళ కుర్రాళ్లు ఆమెను వదల్లేదట. చివరికి వాళ్లందరితో ఓ ఫోటో దిగి అక్కడ్నుంచి తుర్రుమని జారుకుందట. కుర్రాళ్లాయే... సినిమాల్లో అంత "దమ్ము"గా చేస్తే ఊరుకుంటారా మరి...
