1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. ప్రభాస్‌తో కంగన రనౌత్ బిజీ బిజీ..!

Kangana busy with Prabhas! | ప్రభాస్‌తో కంగన రనౌత్ బిజీ బిజీ..!

వినోదం
బాలీవుడ్ హాటెస్ట్ గర్ల్ కంగన రనౌత్, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో బిజీ బిజీగా ఉందట. క్రేజీ మాస్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రంలో ప్రభాస్ సరసన కంగన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లోనే కంగన, ప్రభాస్‌తో తెగ బిజీబిజీ కనిపిస్తోందట.

షూటింగ్ సమయంలోనే ప్రభాస్ వెంటే తిరుగుతోందట. కాస్త విరామం దొరికితే చాలు.. ప్రభాస్ పక్కన కూర్చుని ముచ్చట్లు ప్రారంభిస్తోందట. మొత్తానికి కంగన ప్రభాస్‌ను వలలో వేసుకుంటుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

అయితే బిల్లా స్టార్ ప్రభాస్ కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను పట్టాడని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. "బుజ్జిగాడు" హీరోయిన్ సంజనతో ప్రభాస్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. "బుజ్జిగాడు" సినిమాతో పరిచయమైన సంజనతో ప్రభాస్ టచ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది..? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో తిరిగే ఛాన్స్ కంగనకు లేనట్లేగా..!