1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. "హిస్"లో బట్టలు లేకుండా మల్లికా..!

Mallika without clothes in Hissss! | "హిస్"లో బట్టలు లేకుండా మల్లికా..!

వినోదం
బాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో అలరించే అందాల ముద్దుగుమ్మ, సెక్సీతార మల్లికా షెరావత్ తన తాజా హాలీవుడ్ సినిమా "హిస్"లో విత్ అవుట్‌గా నటిస్తోందట. ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశంలో మల్లికా బట్టలు లేకుండా నటిస్తోందని ఇటీవల విడుదలైన హిస్ ట్రైలర్‌ను బట్టి తెలిసింది.

ఇందులో పగబట్టిన పాముగా మల్లిక నటిస్తోంది. ఒక సన్నివేశంలో శరీరంపై బురద పూసుకుని మల్లికా షెరావత్‌ నగ్నంగా ప్రదర్శన ఇచ్చింది. దీంతో హిస్ ప్రోమోను వీక్షించేందుకు మల్లికా షెరావత్ అభిమానులు బ్రౌజింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారట.

"హిస్" చిత్రంలో మల్లికా పోషించిన నాగిణి పాత్రకు తప్పకుండా అవార్డొస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. ఇందులో షెరావత్ నగ్నంగా నటించిందన్న వార్తలే హిస్ సినిమాకు మంచి పబ్లిసిటీని సంపాదించి పెడుతున్నాయని వారు చెబుతున్నారు.

నాగిణిగా హత్యలు చేస్తూ, అందాలు ఆరబోసిన మల్లికా షెరావత్‌కు ఈ సినిమా మంచి గుర్తింపును సాధించిపెడుతుందని సినీ వర్గాల్లో టాక్. అంతేగాకుండా.. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో, హద్దులు దాటిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండటంతో భారతీయ సెన్సార్ బోర్డు హిస్‌కు పచ్చజెండా ఊపదని సినీ పండితులు భావిస్తున్నారు.

ఇకపోతే.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటోన్న హిస్‌లో మల్లికా షెరావత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మల్లికాతో పాటు భారతీయ నటులు ఇర్ఫాన్ ఖాన్, దివ్య దత్తాలు కూడా "హిస్" ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాకు జెన్నీఫర్ లించ్ దర్శకత్వం వహిస్తున్నారు.