1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. కత్రీనాకు సల్మాన్ గుడ్‌బై..!?

Salman throws Katrina out of his life | కత్రీనాకు సల్మాన్ గుడ్‌బై..!?

వినోదం
ఆసియా అందగత్తె కత్రీనా కైఫ్‌కు ఆమె బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుడ్‌బై చెప్పబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో గడిపేందుకు కత్రీనా కైఫ్ అంతగా ఆసక్తి చూపడం లేదని, అతడి సినీ కెరీర్‌కు సంబంధించిన ఐడియాలకు కూడా ఆమె ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిసింది.

ఏ విషయమైనా సల్మాన్‌తో చర్చించి నిర్ణయం తీసుకునే కత్రీనా ఈ మధ్య తనకు తోచినట్లు నడుచుకుంటుందని సమాచారం. దీంతో సల్మాన్ కత్రీనా జ్ఞాపకాలకు తొలగించాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అంతేగాకుండా.. కత్రీనాను పూర్తిగా మరిచిపోయేందుకు సల్మాన్ ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితుల సమాచారం.

ఇటీవల అక్షయ్ కుమార్‌ సరసన నటించే ఓ సినిమా అగ్రిమెంట్లో కత్రీనా, సల్మాన్‌ ఖాన్‌తో ఒక మాట కూడా చెప్పకుండా సంతకాలు చేసేసిందని తెలిసింది.

మరోవైపు... రణ్‌బీర్ కపూర్‌తో కత్రీనా కైఫ్ క్లోజ్‌గా ఉందనే వార్తలు కూడా గుప్పుమనడంతో సల్మాన్ ఇంకా ఫైర్ అయిపోతున్నాడట. దీంతో కత్రీనాతో తన సంబంధాలను తెంచేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంకేముంది..? సల్మాన్-కత్రీనాల రెండేళ్ల ప్రేమాయణం త్వరలో గంగలో కలిసిపోనుందని సినీ పండితులు భావిస్తున్నారు.
About Writer
SELVI.M