1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. హాలీవుడ్ సినిమాలో సెక్సీతార బిపాసా..!

Bipasha to make love in a Hollywood film | హాలీవుడ్ సినిమాలో సెక్సీతార బిపాసా..!

వినోదం
బాలీవుడ్ భామలకు ఈ మధ్య భలే హాలీవుడ్ ఛాన్సులు వచ్చేస్తున్నాయి. ఒకవైపు మల్లికా షెరావత్ తన అందచందాలను "హిస్" చిత్రంలో ఆరబోస్తుంటే.. దానికి తానేమాత్రం తీసిపోనంటూ బాలీవుడ్ గ్లామర్ గర్ల్ బిపాసా అంటోంది.

తన వంపుసొంపులతో కుర్రకారును మత్తెక్కించే బిపాసా బసు, హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమౌతోంది.

తాజాగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బిల్లి జేన్ చిత్రంలో నటించే అవకాశం బిపాసా బసుకు దక్కిందట. డానియల్, తపన్ సహల రికమండేషన్‌లో అమ్మడుకు ఈ ఛాన్స్ లభించిందని సినీ వర్గాల్లో టాక్. ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందని తెలిసింది.

పంచాగ్ని, మహాబలేశ్వర్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో బిపాసా తండ్రి పాత్రను విక్టర్ బనర్జీ పోషిస్తుండగా, తల్లిగా షాబానా అజ్మి నటిస్తోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. "చిమెరా" అనే పేరుతో రూపుదిద్దుకుంటోన్న బిల్లి సినిమాలో దర్శకుడు సహ డాక్టర్ పాత్రను పోషిస్తున్నారు. డైరక్టర్ సహకు స్నేహితుడిగా స్లమ్‌డాగ్‌ మిలియనీర్ ఫేమ్ అనిల్ కపూర్ నటిస్తున్నారని తెలిసింది.
About Writer
SELVI.M