Navdeep Scared of snakes | పాము బుసతో సొమ్మసిల్లిన నవదీప్!
గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామలో హీరోగా నటించిన నవదీప్.. పాము బుసకొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడట. తాజాగా నవదీప్ నటించిన "యాగం" సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరిగింది.
అక్కడ పామును ముద్దుపెట్టుకునే సన్నివేశంలో నవదీప్ నటించాల్సి ఉంది. రిస్క్ అయినా ఫర్వాలేదని ఒరిజినల్‌గా చేయాలని భావించి నవదీప్ సాహసం చేశాడు.
బ్యాంకాక్‌లో పాముల్ని ముద్దు పెట్టుకోవడం అనేది ఓ క్రీడగా భావిస్తారు. బెట్టింగ్‌లు కూడా కడతారు. దీంతో తాను కూడా చేయగలననే ధీమాతో నవదీప్ కోబ్రా ముందు నిలిచాడట.
ఎదురుగా లైట్లు, యూనిట్ జనమంతా ఉండేసరికి ఆ పాము కాస్త ఖంగారుపడి, ఓ జంప్‌చేసి నవదీప్ కుడిభుజం పైకి దూకింది. దీనికి తోడు బుస్ అని శబ్దం చేస్తూ నవదీప్‌పై ఎగిరిపడటంతో యూత్‌హీరో భయపడి కళ్ళు తిరిగి పడిపోయాడట.
తర్వాత పామును ఆడించేవారు వచ్చి నవదీప్‌ను చూసి.. మూర్చపోయాడని కాస్త నీళ్ళు చల్లగానే లేచాడట. దీంతో యూనిట్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. రియలిస్టిక్‌గా చేస్తే ఇలాగే ఉంటుందని అక్కడున్నవారు నవదీప్‌ను మందలించారట.
ఇకపై ఇటువంటి సాహసాలు చేయనని కాకపోతే రియలిస్టిక్ ఉండాలని తాను ఇలా చేశానని నవదీప్ అన్నాడట. మరి నిజంగా పాము కరిచి ఉంటే.. ఈ పాటికి వేరే ఇండస్ట్రీ వెళ్ళిపోయేవాడినని (పైలోకానికి) చమత్కరించాడట.