Shobhana as choreographer | కొరియోగ్రాఫర్‌గా నృత్యతార శోభన!
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల వలె రాణించిన అందాల తార శోభన కొరియోగ్రాఫర్‌గా అవతారమెత్తనుంది. నాగార్జున "విక్రమ్" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శోభన, నటన, నాట్యంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది.
చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు, వంటి చిత్రాల్లో శోభన నటించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ తన నటనతో అగ్రకథానాయికగా ముద్రవేసుకుంది.
తమిళ సూపర్ స్టార్ హీరోగా నటించిన చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రంలో అద్భుతంగా నటించి అవార్డు కూడా కైవసం చేసుకున్న శోభన, కొంత కాలం పాటు నటనకు స్వస్తి చెప్పి డాన్స్ స్కూలు ప్రారంభించింది. ఎందరో కళాకారులకు నాట్యం నేర్పుతున్న శోభన "రావణ" సినిమాకు కొరియోగ్రాఫర్ బాధ్యతలు చేపట్టిందని సినీ వర్గాల సమాచారం.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించే ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌కు శోభన డ్యాన్స్ నేర్పిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఇంకేముంది..? రావణ సినిమాలో ఐశ్వర్యారాయ్ నాట్య ప్రదర్శనను బట్టి శోభన టాలెంట్ ఏమిటో? ప్రేక్షకులకు అర్థమైపోతుందని సినీ పండితులు అంటున్నారు. మొత్తానికి శోభన కొరియోగ్రాఫర్‌గా రాణించాలని మనమూ ఆశిద్దాం.