అయ్యో ఆర్తీ.. అప్పుడే విడాకులా...!?
|
ఆర్తి దీనస్థితిని తెలుసుకున్న కొందరు పాత స్నేహితులు ఇంటికొచ్చి మరీ పలుకరించి వెళుతున్నారట. వీరిలో మగ స్నేహితులు కూడా ఉన్నారని టాలీవుడ్ సినీజనం ఒహటే చెవులు కొరుక్కుంటున్నారు.
మగ స్నేహితులు అంటే.. ఎవరై ఉంటారబ్బా... ఆ సంగతి తర్వాత చూద్దాం. ఈ విడాకుల వార్త విన్న ఆర్తీ అగర్వాల్ మాత్రం చిందులేస్తోందట. ఆమె బుగ్గలు మరింత ఎరుపెక్కాయట. ముఖమంతా కందగడ్డలా మారిపోయిందట.
పనీపాటలేనివారు ఇటువంటి చెత్త రాతలు రాస్తారని తిట్టి పోస్తోందట. ఇంతకీ ఆర్తీ తన విడాకుల సంగతి మాత్రం చెప్పనేలేదట. మళ్లీ మనం అడిగితే మరోసారి ఆమె బుగ్గలు ఎరుపెక్కుతాయ్. ఎందుకులే వదిలేద్దాం. నిజం నిదానంగానైనా తెలుస్తుంది కదా. ఏమంటారూ...?
