గాయని, నటీమణిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోన్న సెక్సీతార మమతా మోహన్ దాస్. యమదొంగ, కృష్ణార్జున. విక్టరీ, హోమం, చింతకాయల రవి వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ రాణాతో ప్రేమాయణం జరుపుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
రామానాయుడు మనుమడు, సురేష్ బాబు తనయుడైన రాణాతో మమతా డేటింగ్ కూడా జరుపుతుందని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి. రాణా-మమతా మోహన్‌దాస్‌లు ఈ మధ్య చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సమాచారం. ప్రస్తుతం హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తోన్న రాణా, షూటింగ్ గ్యాప్‌లో మమతాతో ఎంజాయ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ విషయం నిజమేనా? తల్లీ అని మమతాను కదిలిస్తే.. అమ్మడు బుస కొట్టిన పాములా కోపంతో ఎగిరి పడుతోంది. రాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. ఇంకేముంది..? మమతా చెప్పేది నిజమైతే? నమ్మితీరాల్సిందే..?