1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Slim

Namita | Slim | Ileana | Bhumika Chavlaw | Bharat Tagore | నమిత, ఇలియానాలకు భూమిక భర్త పాఠాలు

నమిత
ఈమధ్య నమిత తాను పోలీసు పాత్రకోసం 9 కేజీలు బరువు తగ్గానని అన్నది కదా. అదేవిధంగా ఇలియానా కూడా "కిక్" చిత్రం కోసం బక్కపలచగా తయారయ్యానని చెప్పింది కదూ. ఈ నేపథ్యంలో మీరిద్దరూ జీరో ప్యాక్ కోసం యత్నించారా అని ఓ పిల్ల జర్నరిస్టు పలకరిస్తే కానేకాదంటున్నారట బొద్దుబక్కపలచని భామలు.

ఏదేమైనా సరే బొద్దుగా ఉండే నమిత స్లిమ్‌గా మారడానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఆమె నటిస్తున్న షూటింగ్ స్పాట్‌కి సదరు పిల్ల జర్నలిస్టు మరోసారి వెళ్లాడు. నమిత కనబడిందే తడవుగా, మీ బొద్దందాలు స్లిమ్‌గా మారడం వెనుక రహస్యం... అని నసగడం మొదలుపెట్టాడు.

అతగాడిని చూసిన నమిత, ఆ సీక్రెట్ చెప్పేవరకూ వదలవన్నమాట అన్నదట. ఆ తర్వాత అతనితో "నాదేం లేదు.. అంతా భూమిక పుణ్యమ"ని చెప్పిందట. దాంతో పాపం పిల్ల జర్నలిస్టు అయోమయానికి గురై, మీరు సన్నగా మారడానికి భూమిక కారణమెలా అవుతుంది మిస్... అనడిగితే, నవ్వేస్తూ.. ఆమె భర్త భరత్ ఠాగూర్ తన యోగా గురువనీ, ఆయన తనకు యోగా పాఠాలు నేర్పి తన లావును ఇట్టే మాయం చేశాడని సెలవిచ్చిందట.
 
 


ఇలియానా కూడా ఇదే రకంగా చెప్పుకొచ్చిందట. "కిక్‌"లో తాను రివటలా సన్నగా మారడానికి భరత్ ఠాగూర్ ఎంతో శ్రమించారని అంటోందట. మొత్తానికి భూమిక తన భర్త భరత్ ఠాగూర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచే చేసిందని టాలీవుడ్ హీరోహీరోయిన్లు అనుకుంటున్నారు.

మరోవైపు భరత్ డైమండ్ వ్యాపారం చేస్తూ, డైమండ్ ఉంగరాలను తొడుక్కుంటే లక్ కలిసొస్తుందని ప్రచారం చేస్తున్నాడట. ఇలా డైమండ్ రింగులను తొడుక్కోమంటూ యోగా పాఠాలను ఇంకెంతమంది హీరోయిన్లకు చెపుతాడో. మరి దీనికి భూమిక ఏమంటుందో... చూద్దాం. మన పిల్ల జర్నలిస్టు ఎటూ చెపుతాడుగా.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT