Hansika | Hot Actress | Bollywood | Allu arjun | ఇంకా పక్వానికి రాలేదంటున్న "ముదురు" పాప
'దేశముదురు' చిత్రంతో కోలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ హాన్సిక. ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇంకా మైనరేనట. తానింకా చిన్నపిల్లనేనని, తాను ఇంకా పరిపక్వానికే రాలేదని స్వయంగా ఊకదంపుడు ప్రచారం చేసుకుంటోంది.
నేను చిన్నపిల్లను. దేనికి ఎంత ఖర్చు చేయాలో కూడా నాకు తెలియదు. అందుకే అన్నీ అమ్మే చూసుకుంటుంది అని ఈ భామ స్వయంగా మీడియాకు ఒలకబోసింది. అయినా అమ్మని మించిన శ్రేయోభిలాషి ఈ ప్రపంచంలో ఇంకెవరుంటారు. అందుకే నా వ్యవహారాలనన్నింటినీ అమ్మే చూసుకుంటుంది.
ఆర్థిక వ్యవహారాలతో సహా ప్రతి విషయం. ఎవరితో ఎలా ఉండాలో.. ఎవరి వద్ద ఎలా నడుచుకోవాలో.. ఇలా ప్రతి విషయం అమ్మే చెప్పిస్తుంది అని అంటోంది. ఈ చిన్న వయస్సులోనే వెండితెరలో అవకాశాలు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అయితే, నేను సంపాదించిన సొమ్మును ఏం చేస్తాననే సందేహం మీడియా వాళ్ళకు ఉంది.
అమ్మ పుట్టినరోజు, దీపావళి, కొత్త సంవత్సరం ఇలాంటి పండుగ, శుభ సమయాల్లో షాపింగ్‌కు ఖర్చు చేస్తాను. నాకు నచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు కొనిస్తాను. వారు ఎవరైనా కావచ్చు. ఇతరులకు మంచి బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరచడమంటే నా హాబీగా చెప్పుకోవచ్చు అని అమాయకంగా చెపుతోంది.
అంతేకాదు, తాను ఇంకా మైనర్‌ను కావడంతో అమ్మ ప్రతి విషయాన్ని దగ్గరుండి చెపుతుంది. దీనికి తోడు, తాను సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగాననీ, అందువల్ల నలుగురి మధ్య ఎలా నడుచుకోవాలో తెలియదంటోంది. తన సినీ ప్రవేశం కూడా కాకతాళీయంగా జరిగిపోయిందంటోంది.
మమ్మీ డాక్టర్. స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్. ఫిల్మ్ స్టార్స్ కూడా మమ్మీ దగ్గరకు వచ్చి వైద్య సలహాలు తీసుకుంటుంటారు. ఇలాంటి వారిలో బాలీవుడ్‌స్టార్ అరుణ్ ఇరానీ కూడా ఒకరు. ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నేను అడుగుపెట్టేందుకు ఆమె ప్రధాన కారణం. ఇందుకోసం ఆమె వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఈ రంగంలో అవకాశాలు కల్పించారు.