1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. boyfriend

Kollywood | boyfriend | nayanatara | malayalam | lover | simbu | kodambakkam | prabhudeva | | కొత్త బాయ్‌ఫ్రెండ్ అన్వేషణలో నయన

కోలీవుడ్
ఒకటికి రెండు సార్లు ప్రేమలో పడి, వివాదాల్లో చిక్కుకున్న మలయాళ కుట్టి నయనతార మరో కొత్త బాయ్‌ఫ్రెండ్‌ అన్వేషణలో పడినట్టు చెన్నై కోడంబాక్కం వర్గాలు చెపుతున్నాయి. ఈ వార్త తమిళ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. నయన మాజీ ప్రియుడు, యువ హీరో శింబు పెద్దగా పట్టించుకోక పోయినా.. కోడంబాక్కం వర్గాలు మాత్రం సీరియస్‌గానే చర్చించుకుంటున్నాయి. 

తొలుత శింబు ప్రేమలోనూ, తర్వాత నృత్య దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార.. తాజాగా మరో ప్రియుడి కోసం గాలిస్తోందట. ప్రభుదేవాతో సాగించిన ప్రేమాయణం బాగానే సాగింది. ప్రభుదేవా చేతిలో పలు మంచి ప్రాజెక్టులు ఉంటాయని, వాటిలో నటించేందుకు తన పేరును సిఫార్సు చేస్తాడని నయన భావించింది.

ఎందుకంటే శింబుతో ప్రేమ విఫలం కావడంతో ఆమెకు కోలీవుడ్‌లో ఆఫర్లు అమాంతం తగ్గిపోయాయి. దీంతో ప్రభుదేవాను బుట్టలో పడేసుకుందట. అదేసమయంలో ప్రభు కుమారుడు చనిపోవడంతో ఈ ప్రేమకు బ్రేక్ పడింది. దీంతో కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం నయనతార తీవ్రంగా అన్వేషిస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి