1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. బికినీకైనా.. రాక్షసికైనా రెడీ: "శూర్పణఖ" ప్రియమణి

Priyamani,Surpanakha, Ravana, Aishwarya Rai, Bikini | బికినీకైనా.. రాక్షసికైనా రెడీ: "శూర్పణఖ" ప్రియమణి

శూర్పణఖ
రామాయణంలో లంకాధీశుని చెల్లెలు శూర్పణఖ తెలుసు కదా. ఇప్పుడా పాత్రలో టాలీవుడ్ బికినీ భామ ప్రియమణి నటించడానికి రెడీ అందిట. రాక్షసిలా నటిస్తావా...? అని అడిగినవాళ్లతో పోజుగొట్టి మరీ సమాధానాలు చెపుతోందట.

రాక్షసిగా చేయాలన్నా, బికినీ భామగా నటించాలన్నా, మట్టిగొట్టుకుని మురికి పిల్లగా కనిపించాలన్నా తనకే సాధ్యమని గొప్పలు పోతోందట. అన్నట్లు చెప్పడం మరిచాను... బికినీ ప్రియమణి ఈ పాత్రను మణిరత్నం "రావణ" చిత్రంకోసం చేస్తోందట.

ఈ చిత్రంలో శ్రీరామునిగా "అపరిచితుడు" విక్రమ్ నటిస్తుండగా, రావణుడుగా వెండితెర సీత(ఐశ్వర్యారాయ్) భర్త అభిషేక్ నటిస్తున్నాడు.

ఇక సీతగా ఐశ్వర్యారాయ్ నటన ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కొత్తగా శూర్పణఖ( ప్రియమణి) రాకతో ఆమె నటన మరగుజ్జుగా మారిపోయే అవకాశం ఉందని కోలీవుడ్ సినీజనం అంటున్నారు. మరి శూర్పణఖ అంటే మాటలా మరి... బికినీకైనా.. రాక్షసికైనా దేనికైనా ప్రియమణే సాటి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT