1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Remuneration

Billa| Remuneration| Anushka| Bikini| Krish| vedam | బికినీకైతే కోటి, బొమ్మాళికైతే ఏమీ వద్దంటున్న బిల్లా సుందరి

బిల్లా
టాలీవుడ్ సెక్సీక్వీన్, బిల్లా సుందరి అనుష్క పారితోషికం తగ్గించేసిందట. బిల్లా చిత్రంలో బికినీ ధరించేందుకు కోటి రూపాయలుగా పారితోషికాన్ని పెంచేసిందని ఇండస్ట్రీలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 

అయితే అనుష్క బిల్లా చిత్రానికి 65లక్షల రూపాయలను మాత్రమే తీసుకుందని తెలిసింది.

అయితే ఆమె కోటి రూపాయలు అడుగుతుందని ఇండస్ట్రీలో వార్తలు వెలువడ్డాయి. తాజాగా గమ్యం దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్) "వేదం" అనే చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమా కోసం అనుష్క రేటు తగ్గించుకుందని, రెమ్యునరేషన్‌కంటే తనకు కథ, కథనం చాలా ముఖ్యమమని బిల్లా సుందరి చెబుతోంది.

అదేవిధంగా అరుంధతి లాంటి పాత్రల కోసం పారితోషికం తీసుకోకుండానైనా నటించవచ్చునని గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చిన అనుష్క, వేదం సినిమా కోసం తన రేటును తగ్గించుకుంది. అరుంధతి తర్వాత ఆమె రేటు కోటీ అంటూ హిందీలో కూడా ఆఫర్లు వచ్చినా వేదం కథకోసం పారితోషికాన్ని తగ్గించుకున్నానని అనుష్క అంటోంది.

ఇంకేముంది..? ఈ విషయంలో అనుష్క అభినందనీయురాలేనని ఇండస్ట్రీ భావిస్తోంది. ఈమె బాటలో మిగిలిన హీరోయిన్లు పయనిస్తారో? లేదో వేచి చూడాల్సిందే..!