1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. మలయాళ చిత్రంలో నటిస్తోన్న బొద్దందాల నమిత!

Namitha, Mollywood, glamour, Black Stallion | మలయాళ చిత్రంలో నటిస్తోన్న బొద్దందాల నమిత!

మలయాళం
దక్షిణాది సినీ పరిశ్రమను తన అందచందాలతో ఓ ఊపు ఊపుతున్న సెక్సీతార నమిత మలయాళ సినీ రంగ ప్రవేశం చేయనుందట. ఐటంసాంగ్‌లతో పాటు కథానాయికగా ఓ మెరుపు మెరుస్తున్న నమిత కేరళ ప్రేక్షకులను కూడా తన అందచందాలతో కనువిందు చేసేందుకు సై అంటోందట.

"బ్లాక్ స్టాలిన్" అనే పేరిట రూపుదిద్దుకుంటోన్న మలయాళ చిత్రంలో ఈ సెక్సీబాంబ్ నమిత కీలక పాత్ర పోషించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ప్రముఖ దర్శకుడు ప్రమోద్ పాప్పన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో.. కళాభవన్ మణి సరసన నమిత నటిస్తోందని తెలిసింది. ఇప్పటికే కేరళలోని అద్భుత లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా అక్కడ నమిత అభిమానులు ఉంటున్నారని సినీ యూనిట్ తెలిపింది. ఇటీవల కేరళలోని ఓ అద్భుత లొకేషన్లో నమితపై ఓ సాంగ్ చిత్రీకరిస్తుండగా, ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారని తెలిసింది.

అంతేగాకుండా.. వారందరూ నమిత ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటే అదుపు చేయడానికి చిత్ర యూనిట్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

తదనంతరం నమిత "ఒక హాయ్..! చెప్పి ప్లీజ్ షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగనివ్వకండని" కోరడంతో వారంతా కిమ్మనకుండా ఉండిపోయారని సినీ యూనిట్ తెలిపింది.

ఇకపోతే.. ఈ సెక్సీడాల్ నమిత ప్రస్తుతం "దేశద్రోహి" సినిమాలో పోలీస్ అధికారి పాత్రను పోషిస్తోంది.
About Writer
SELVI.M