1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Prabhu deva

Nayantara| Prabhu deva| Mariage| Pournami| Chandramukhi | నయన, ప్రభుదేవాలకు పెళ్లయిపోయిందట?

నయనతార
నృత్య దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ప్రభుదేవా, సెక్సీతార నయనతారను పెళ్లాడినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. నృత్య దర్శకుడిగా తెరంగేట్రం చేసి హీరోగా, చిత్ర దర్శకుడిగా అవతారమెత్తిన ప్రభుదేవా, తెలుగులో పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా" అనే సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. దుబాయ్ శీను, గజిని, లక్ష్మి, చంద్రముఖి వంటి సినిమాల ద్వారా సెక్సీతారగా ముద్రవేసుకున్న నయనతారను మూడురోజుల క్రితం ప్రభుదేవా పెళ్లాడినట్లు సమాచారం. అయితే ప్రభుదేవా, నయనతారల్లో ఎవరూ తమ పెళ్లి వార్తను ధ్రువీకరించలేదు.

ఈ విషయమై విలేకరులు ప్రభుదేవాను కదిలిస్తే.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ వెల్లడించాల్సిన అవసరం లేదని మొహం మీద కొట్టినట్లు చెప్పేశారని తెలిసింది. అయితే నయనతారతో తన పెళ్లి వార్తను మాత్రం ఆయన ఖండించలేదని సమాచారం.

ఇదిలా ఉండగా.. ప్రేమికుడు, మిస్టర్ రోమియో, మెరుపు కలలు వంటి చిత్రాల ద్వారా హీరోగా మారిన ప్రభుదేవా-నయనతారల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి . ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే వీరిద్దరికి వివాహం జరిగిపోయిందని కోడంబాక్కం వర్గాలు కోడై కూస్తున్నాయి.
About Writer
SELVI.M