గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » యువహీరో రాణాతో మోహన్‌దాస్ ప్రేమాయణం! (Mamata mohandoss | rana | youth hero | film nagar | love | prince of moghal | ramanaidu | cinema |)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FileFILE
మమతా మోహన్‌దాస్ అటు నటిగా, ఇటు గాయనిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే, ఈ ముద్దుగుమ్మ యువ హీరోతో ప్రేమలో పడినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. తెలుగు సినీ మొఘల్ చక్రవర్తి డాక్టర్ రామానాయుడు మనవడు రాణాతో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం సాగిస్తున్నట్టు సినీ వర్గాలు చెపుతున్నాయి.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "లీడర్‌"లో హీరోగా పరిచయం అవుతున్న రాణాను చూసిన తొలిచూపులోనే మమతా ప్రేమలో పడిపోయిందట. ఈ విషయం తెలుసుకున్న రాణా.. తన తొలి చిత్రంలో హీరోయిన్‌గా మమతను ఎంపిక చేయాలని.. తాతకు సిఫార్సు చేశాడట. అయితే, దర్శకుడి ఇష్టం మేరకు ఇతర నటీనటుల ఎంపిక ఉంటుందని తాత సెలవివ్వడంతో రాణా తన ప్రేయసికి సాయం చేయలేక పోయారట.

ఈ పుకార్లపై మాత్రం మమతా తీవ్రంగానే మండిపడుతున్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు ఎక్కడ నుంచి పుట్టిస్తారని మీడియాపై మమతా చిందులేస్తోందట. మలళయాళంలో గతంలో ఎదురైన అనుభవాన్నే ఈ ముద్దుగుమ్మ గుర్తుకు తెచ్చుకుని ప్రవర్తిస్తోందట. రాణా తనకంటే చిన్న వయస్సు పిల్లవాడు. అతనితో నాకు ప్రేమాయణం ఏంటీ అని ప్రశ్నిస్తోంది. ఏది ఏమైనా.. "నిప్పు లేనిదే పొగరాదన్న" సామెతను మమతా మోహన్‌దాస్‌ మరచిపోయినట్టుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మమతా మోహన్దాస్, రాణా, యువహీరో, ఫిల్మ్ నగర్, ప్రేమ, మొఘల్ చక్రవర్తి, రామానాయుడు, సినిమా