Bipasa| Maradona Rebello| Bollywood| kiss scene | బిపాసా-మారడోన్నాల కిస్ సీన్ అదిరింది..!
బాలీవుడ్‌కు మారడోనా రెబెల్లో అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సుదిప్తొ ఛటోపాండే దర్శకత్వం వహిస్తోన్న పంక్ సినిమాలో రెబెల్లో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ సన్నివేశంలో రెబెల్లో అద్భుతంగా నటించి అదరగొట్టాడు. ఈ సన్నివేశం ద్వారా బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తరహాలో రెబెల్లో కూడా ప్రేక్షకులకు దగ్గరవుతాడని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.
ఈ సన్నివేశంలో రెబెల్లోకు సహకరించింది ఎవరో తెలుసా? మన బాలీవుడ్ హాట్ గర్ల్ బిపాసా బసు. సెక్సీతారగా ముద్రవేసుకున్న బిపాసా రెబెల్లోతో తీసిన ఆ కిస్ సన్నివేశంలో చాలా చక్కగా నటించిందని సమాచారం.
ఈ సన్నివేశం గురించి మారడోనా రెబెల్లోనూ కదిలిస్తే.. దర్శకుడు ఆ సీన్ గురించి చెప్పగానే కాస్త తడబడ్డానని అన్నాడు. ఈ సీన్ గురించి తన తల్లిదండ్రుల వద్ద సంప్రదించి, వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే నటించానని చెప్పాడు. ఈ హాట్ సీన్స్‌తోనే పంక్ సినిమా హిట్ అవుతుందని మారడోనా తెలిపాడు.
ఈ సన్నివేశంలో బట్టలు లేకుండా కెమెరా, చిత్ర యూనిట్ ముందు బిపాసాకు ముద్దిచ్చే సన్నివేశాన్ని అనుకుంటేనే సిగ్గేస్తుందని, కానీ తడబాటుతోనే ఆ సీన్‌లో అద్భుతంగా నటించేశానని మారడోనా చెప్పాడు.
ఇంకేముంది..? చిత్రయూనిట్ సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి హాట్ సన్నివేశాలను చిత్రీకరించడం సహజమే. మరి మారడోనా ఈ సన్నివేశాల ద్వారా హీరోగా ఎలా ప్రేక్షకులకు దగ్గరవుతాడో? వేచి చూడాల్సిందే..!
