Aishwarya Rai, kitchen, Bachchan, TV Channels, | వంటగదిలో ఐశ్వర్యారాయ్: ఎగబడుతున్న టీవీ ఛానళ్లు
|
కోడలుపిల్ల వంటగదిని కూడా చూసుకోవాలని బచ్చన్ కుటుంబం ఆకాంక్షించిందో, లేదంటే స్వయంగా ఐశ్వర్యారాయ్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందో కానీ, తన భర్త అభిషేక్‌తో కలిసి ముంబయిలోని ఓ సూపర్ మార్కెట్లో వంట సామగ్రిని కొనుగోలు చేసిందట ఐష్.
ఆమె సామగ్రిని కొంటుంటే, ఏ వస్తువులను కొంటుందో చూసేందుకు అక్కడివాళ్లు ఎగబడ్డారట. ఆ సంగతి సరే... అసలు ఐష్ వంట చేసేటపుడు షూటింగ్‌కు అనుమతి ఇస్తే తమ టీవీల్లో "ఇల్లాలు- వంటలు" కార్యక్రమాల్లో వేసుకుంటామని పలు టీవీ ఛానళ్లు ఎగబడుతున్నాయట. ఐష్ నటనకే కాదు... వంట చేస్తున్నా డబ్బు పంటేనన్నమాట.
