1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. cinema

Rajanikanth | cinema | superstar | nayanatara | prabhudeva | simbu | raviteja | vinayak | | నయన వివాహం.. వీడని దేవ "రహస్యం"

రజనీకాంత్
FileFILE
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. ఆది నుంచి వివాదాల్లో చిక్కుకుని తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. గతంలో శింబుతో ప్రేమాయణం, అతనితో వెండితెర 'చుంబన' దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత శింబుతో ప్రేమాయణం వికటించడంతో నయనతార మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యారు.

దీంతో తేరుకున్న నయన తన కెరీర్‌పై దృష్టి సారించి, కాస్త బిజీ అయింది. ఇంతలో మరోవివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాను నయనతార రహస్యంగా వివాహమాడినట్టు ఇటు తెలుగు, అటు తమిళ వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

ఈ వార్తను ప్రభుదేవా ఖండిచలేదు. అది తన వ్యక్తిగత వ్యవహారమని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. అయితే, నయనతార మాత్రం.. ఖండించడం విశేషం. ప్రభుదేవా తరపు నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధనం రాకపోవడంతో.. యువత కలలరాణి నయనతార వివాహంపై నెలకొన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

"సీక్రెట్‌గా పెళ్లి చేసుకునే గత్యంతరం నాకు లేదు, ఒక వేళ పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను" అని నయనతార కోపంగా సమాధానం ఇస్తోంది. ప్రస్తుతం నయనతార రవితేజ కథానాయకుడుగా నటిస్తున్న ‘ఆంజనేయులు’, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తోంది. ఇవేకాకుండా ప్రభుదేవా దర్శకత్వం వహించే చిత్రంలోను, పలు తమిళ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.
About Writer
PNR