గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » నాజూకు షేప్‌కోసం 'ఆవకాయ' పాట్లు..! (Bindu Madhavi| Tollywood| Beauty| Avakaya Biryani)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FILE
"ఆవకాయ్ బిర్యానీ" చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సొట్ట బుగ్గల చిన్నది, అచ్చ తెలుగు అమ్మాయి "బిందు మాధవి".

ఈ మదనపల్లి అమ్మడికి ఈ మధ్య ఛాన్సులు వెల్లువల్లా రావడంతో ఆహారం తీసుకునే విషయంలో అతి జాగ్రత్తలు పాటిస్తోందని ఆమె సన్నిహితుల సమాచారం.

తెరపై ప్రేక్షకులను ఆకట్టుకునే కత్తిలాంటి శరీరాకృతి కోసం బిందు జంక్ ఫుడ్‌ను తీసుకోకూడదని నిర్ణయించిందట. కేలరీస్ తక్కువ గల ఆహారాన్ని మాత్రమే అమ్మడు క్రమంగా తీసుకుంటుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతేకాదు.. బాడీ ఫిట్‌నెస్ కోసం మాధవి వ్యాయామాలు కూడా చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసేసిన బిందు మాధవి, ఆవకాయ్ బిర్యానీ సినిమా కంటే ఫ్రెష్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సై అంటోందని సినీ వర్గాల్లో టాక్. ఆహారం విషయంలోనే మాత్రమే గాకుండా ఆకర్షిత ఛాయ కోసం అమ్మడు ఏవేవో క్రీమ్‌లు కూడా మొహానికి తెగ పూసేస్తుందని సమాచారం.

ఇంకేముంది..? తన అందానికి వన్నె తెచ్చుకునే దిశగా ప్రయత్నిస్తోన్న బిందు మాధవికి టాలీవుడ్‌లో మంచి అవకాశాలు రావాలని మనమూ ఆశిద్దాం..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బిందు మాధవి, ఆవకాయ్ బిర్యానీ, టాలీవుడ్, జంక్ ఫుడ్, కేలరీస్