Charme| Krishna vamsi| Manorama| 16Days | ఫ్లాప్‌లతో విసిగిపోయిన ఛార్మీకి కృష్ణవంశీ ఛాన్స్..!?
వరుస ప్లాప్‌లతో విసిగి పోయిన టాలీవుడ్ ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీకి కొత్త లైఫ్ ఇవ్వడానికి కృష్ణవంశీ సిద్ధమయ్యాడనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
"అనుకోకుండా ఒకరోజు" చిత్రంతో హీరోయిన్ ఓరియేంటెడ్ చిత్రాల్లో బిజీ అయిన ఛార్మీ, "మంత్ర"తో ఆ తరహా చిత్రాలకు ఆమే దిక్కనే స్థాయికి ఎదిగింది.
అయితే 16డేస్ ప్లాప్ కావడంతో పాటు మాయగాడు ఇంకా రిలీజ్‌కాకపోవడం, కావ్యాస్‌డైరీ ఓ మోస్తరుగా ఆడడడం.. వంటి కారణాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. రాఖీ తర్వాత పెద్ద హీరోల సరసన నటించే ఛాన్సులు కోల్పోయిన ఛార్మీ, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
'శ్రీఆంజనేయం' సినిమాలో కృష్ణవంశీ ఛార్మీని ఎక్పపోజింగ్‌కు బాగా ఉపయోగించుకున్నాడని, ఇదే తరహాలోనే ఈ సినిమాలోనూ వాడుకుంటాడని బెల్లంకొండ సురేష్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంకేముంది..? ఈ సినిమా ఛాన్స్ ఛార్మీకి లభిస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే.!
