1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Rachana Maurya

Mumaith Khan| Rachana Maurya| Bala krishna| Mitrudu| Item Girl | ముమైత్‌కు పోటీగా మరో సెక్స్‌బాంబు..!

టాలీవుడ్
టాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో ఇట్టే ఆకర్షించే మత్తుకళ్ల సుందరి ముమైత్‌ఖాన్‌కు పోటీగా మరో సెక్సీడాళ్ రంగంలోకి దిగింది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో విధాలుగా అందాలను ఆరబోస్తున్న ముమైత్ ఖాన్‌తో పోటీ పడేందుకు బ్యూటీ డాళ్ మౌర్య సై అంటోందని సినీ వర్గాల్లో సమాచారం.

తాజాగా విడుదలైన పున్నమినాగులో ఏకంగా బికినీతో దర్శనమిచ్చిన ముమైత్‌ఖాన్‌ హీరోయిన్ పాత్రలవైపు మొగ్గుచూపడంతో, ఐటంసాంగ్‌లు చేయడానికి పలువురు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ కోవలో రచనామౌర్య పేరు ముమైత్‌ఖాన్ రేసులో విన్పిస్తోంది.

పలు చిత్రాల్లో ఐటం గాళ్‌తో తన అందాల్ని ఆరబోసిన మౌర్య తాజాగా బాలకృష్ణ సరసన 'మిత్రుడు'లో నటించింది. మళ్ళీ అదే ఇంకా ప్రారంభంకాని బాలకృష్ణ చిత్రం సినిమాల్లోనూ ఆమె బుక్ అయ్యింది.

దీంతో పాటు మరో రెండు కొత్త చిత్రాల్లోనూ మౌర్య ఐటంగాళ్‌గా ఛాన్సు కొట్టేసింది. దీంతో ముమైత్‌ఖాన్‌ ప్లేస్‌ రచనా మౌర్య ఫిల్‌ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
About Writer
SELVI.M