1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Beach bath

Kim Sharma | Beach bath | Bathtub bath | కిమ్ శర్మ సరిగంగ స్నానాలు

కిమ్ శర్మ
సోయగాలు పోతూ పారే జలపాతంలో ఒక్కసారైనా జలకాలాటలాడాలని అనుకోని వారుండరు. ఇదలా ఉంచితే బాలీవుడ్ అందాలు పూబోణి కిమ్ శర్మ జలపాతాలు, సముద్రాలు, నదులు, బాత్‌టబ్‌లు ఇలా అన్నింటిలోనూ స్నానాలు చేసిన అనుభవం తనకు ఉన్నదని చెపుతోంది. ఆ అనుభవం ఎలా ఉందేంటీ... అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది.

జలపాత స్నానం: కొన్నాళ్ల క్రితం అదిరేపల్లి జలపాతానికి వెళ్లా. నేను అక్కడికి వెళ్లినప్పుడు జలపాతంలో అంతగా నీరు లేదు. అంతే ఒక్కసారిగా నాలో ఆనందం కట్టలు తెంచుకుంది. అందులోకి దుమికి నా ఇష్టం వచ్చినంత సేపు ఈత కొట్టాను. అప్పుడు ఎంత అలుపు వచ్చిందో.

సముద్ర స్నానం: ఇది నాకెంతో ఇష్టమైన స్నానం. ఈత అంతగా రాకపోయినా అలలపై తేలియాడుతూ స్నానం చేస్తుంటే ఆ అనుభూతే వేరు. ముఖ్యంగా ఒంటిపై ఉప్పు నీరు అతుక్కుపోయి ఆ సమయంలో నా శరీరం ఎంతో సెక్సీనెస్‌ను సంతరించుకుంటుంది. అది నాకు నేను మురిసిపోతుంటాను.

బాత్రూం స్నానం: బాత్రూంలో నాకు నచ్చిన పాటను కూనిరాగాలు తీస్తూ స్నానం చేయడం నాకు ఎంతో ఇష్టం. కనీసం గంటకు తగ్గకుండా నా ఒళ్లును బాత్రూంలో తడిపేసుకుంటూ ఉంటా.

సోప్‌తో స్నానం: ఇంతకుముందు కొత్త సోపులతో స్నానం చేసేదాన్ని. కానీ నా చర్మ నిగారింపును అవి తగ్గిస్తున్నట్లు అనిపించింది. దాంతో ఒకే బ్రాండ్ సోప్‌ను వాడుతున్నాను... అని తన స్నానపు అనుభవాలను చెప్పుకొచ్చింది కిమ్ శర్మ.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT