Simbhu| Trisha| Nayanatara| Prabhu deva| Love | శింబుతో ప్రేమా? అవన్నీ ఉత్తుత్తి వార్తలే..!: త్రిష
|
టాలీవుడ్ ఇండస్ట్రీకి మొన్నమొన్ననే వచ్చినట్లుందని, ఇంతలో ఏర్పడిన ఎన్నో పరిచయాలు, మార్పులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని త్రిష చెబుతోంది. అందుకే వాటినన్నింటిని డైరీగా రూపాంతరం చేస్తున్నానని అంటోంది ఈ సొట్టబుగ్గల చిన్నది.
తనకు ఏమాత్రం ఖాళీ దొరికినా మసాజ్ కేంద్రానికి వెళ్తుంటానని నటి త్రిష చెబుతోంది. అన్ని రోజులు షూటింగ్‌లంటూ.. సినిమాలంటూ ఊరుకాని ఊరుల్లో తిరిగినా.. మన ప్రాంతానికి వచ్చాక మంచి మసాజ్ సెంటర్‌కెళ్తే కాస్త బడలిక పక్కనపెట్టినట్లుందని అంటోంది.
ఇదిలా ఉండగా.. ఈ మధ్య శింబు నయనతార విడిపోయారు. ఇది తెలిసేలోపే నయనతార, ప్రభుదేవా జోడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు శింబు గ్లామర్‌క్వీన్ త్రిషను ప్రేమలో పడేశాడని కోడంబాక్కం వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వీరిద్దరూ 'అలై' అనే చిత్రంలో జంటగా నటించారు. ప్రస్తుతం 'విన్నైత్తేడి వరువాయ' అనే చిత్రంలో మళ్లీ జోడీ కట్టారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఆసక్తి రేకెత్తింది.
అయితే త్రిష మాత్రం ఇవన్నీ ఉత్తుత్తి వార్తలేనని, ఈ వార్తల్లో నిజంలేదని అంటోంది. ఇటువంటి గాలి వార్తలను తాను పట్టించుకోనని, తనకు నచ్చినవాడు ఎదురుపడితే అప్పుడు ఈ విషయంపై ఆలోచిస్తానని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతానికి సినిమాలే తనకు ముఖ్యమని త్రిష స్పష్టం చేసింది.
ఈ విషయంపై శింబును కదిలిస్తే.. వీటిని అంతగా పట్టించుకోనవసరంలేదని చెప్పాడు. అంటే.. ఆ వార్తలా..? లేదా త్రిష చెప్పిన మాటలా..? అనేది వేచి చూడాల్సిందే..! మరి..!
